AndhraPradesh: వర్షంలోనే కొనసాగుతున్న సీఎం వైఎస్ జగన్ పర్యటన
CM Jagan Konaseema Tour: గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం వైయస్ జగన్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం జి.పెదపూడి చేరుకున్నారు. పెదపూడిలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వర్షంలోనే వరద బాధితుల వద్దకు సీఎం చేరుకున్నారు. గోదావరి వరద బాధితులతో సీఎం వైయస్ జగన్ ముచ్చటించారు.
వరదల వల్ల కలిగిన నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమాల గురించి నేరుగా బాధితులనే అడిగి తెలుసుకున్నారు.. అనంతరం పెదపూడి నుంచి లంక గ్రామాలకు చేరుకున్న సీఎం.. వరద బాధితులను కలుసుకొని.. వారితో కాసేపు ముచ్చటించారు. ట్రాక్టర్‌పై వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ఈ నేపథ్యం లో పునరావస శిబిరాల్లో బాగా చూసుకున్నారా… కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చు అని వరద బాధితులను సీఎం జగన్ అడిగారు.దీనికి సమాధానంగా వాలంటీర్లు బాగా పని చేశారని సీఎంకు వివరించారు.
ముఖ్యమంత్రి జగన్ మధ్యాహ్నం పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజోలు మండలం చేరుకుని.. వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.