CM YS Jagan on AP Cabinet : హెచ్చరించినట్లే… ఉద్వాసన తప్పదా?
CM YS Jagan on AP Cabinet : నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల తరువాత క్యాబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో ఆమోదించాల్సిన బిల్లులు, బడ్జెట్, వ్యవసాయం బడ్జెట్ తదితర అంశాలపై చర్చించారు. ఈ చర్చల అనంతరం సీఎం జగన్ మంత్రులతో ముచ్చటించారు. మంత్రివర్గ విస్తరణ తరువాత చాలా మంది మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోవాలని, లేదంటే ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. అయినప్పటికీ కొంతమంది మంత్రులు పనితీరు మార్చుకోకపోవడంతో నేడు మరోసారి జగన్ ఆయా మంత్రలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇలా హెచ్చరించిన వారిలో చాలా మంది ఉన్నప్పటికీ ప్రముఖంగా కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి.
వారిలో సిదిరి అప్పలరాజు, గోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, పినిసే విశ్వరూప్, తానేటి వనిత, నారాయణ స్వామి, గుమ్మనూరు జయరాం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, వీరిని ఇప్పటికిప్పుడు తొలగిస్తారా అంటే చెప్పలేని పరిస్థితి. ఇక, కొత్తగా మరో ముగ్గురికి కేబినెట్‌లో అవకాశం కల్పించాలని సీఎం చూస్తున్నారు. ఇందులో కవురు శ్రీనివాస్, మర్రి రాజశేఖర్, తోట త్రిమూర్తులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరికి అవకాశం కల్పిచాలంటే ముగ్గురుకి ఉద్వాసన పలకాలి. మరి ఆ ముగ్గురు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. వచ్చే ఏడాది ఎన్నికలు జగరనున్న నేపథ్యంలో మంత్రుల పనితీరుపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.