AP Capital: విశాఖకు షిఫ్టింగ్ అప్పటి నుంచే?
AP Capital: అసెంబ్లీ బడ్జెట్ సమాశాల నేపథ్యంలో జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని అంశం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రుల వద్ద వ్యాఖ్యానించారని తెలుస్దొంది. నిజానికి విశాఖ పాలనా రాజధాని అని గతంలో సీఎం జగన్ ప్రకటన చేశారు, అయితే మూడు రాజధానుల అంశం కోర్తుకో ఉండడంతో ఎప్పుడు షిఫ్ట్ అవుతారనే అంశం మీద క్లారిటీ లేదు. ఇక విశాఖకు షిఫ్ట్ అవుతానని ఢిల్లీలో కొద్దిరోజుల క్రితం జగన్ ప్రకటించారు. దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి రాష్ట్రంలో అందరితో నెలకొంది. మంగళవారం కేబినెట్ భేటీలో సీఎం జగన్.. విశాఖ నుంచి పాలనపై మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది, ఈ క్రమంలో అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. జూలైలో విశాఖకు వెళ్తామని సీఎం జగన్ మంత్రులకు స్పష్టం చేశారని అంటున్నారు. మరోపక్క 45 అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.