టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై తెలుగుదేశం పార్టీ, ప్రజలు చేపట్టిన కార్యక్రమాలను చూస్తూ.. జగన్ ప్రభుత్వం వణికిపోతోందని నారా లోకేశ్ (Nara Lokesh)ఎద్దేవా చేశారు.
Nara Lokesh: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై తెలుగుదేశం పార్టీ, ప్రజలు చేపట్టిన కార్యక్రమాలను చూస్తూ.. జగన్ ప్రభుత్వం వణికిపోతోందని నారా లోకేశ్(Nara Lokesh) ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కుట్రలు విఫలం కావాలని.. చంద్రబాబుకు మంచి జరగాలని దేవాలయాలకు వెళుతున్నవారిని కూడా ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం అడ్డుకోవడంపై లోకేశ్ మండిపడ్డారు.
ఢిల్లీలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన లోకేశ్..గుడికి వెళుతున్నవారిని కూడా అర్థం పర్ధం లేని నిబంధనలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం(YSRCP government) అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు వారిని కూడా అరెస్ట్ చేయడం జగన్ పిరికితనానికి నిదర్శనమని లోకేశ్ చెప్పారు. ఇక ఏపీ సీఎం జగన్ పాపం పండిందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి టైమ్ దగ్గర పడిందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
తెలుగుదేశం నేతల్ని చివరకు ప్రజలను కూడా గుడికి వెళ్లాలో వద్దో కూడా జగన్ ఎందుకు నిర్థేశిస్తున్నారంటూ లోకేశ్ ప్రశ్నించారు. ఇలా ముందస్తు అరెస్టులతో, గృహ నిర్భంధాలతో టీడీపీ నిరసనలను కానీ.. చంద్రబాబుకు వస్తున్న మద్ధతును కానీ ఎవరూ అడ్డుకోలేరని లోకేశ్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్టుపై దేశ, విదేశాల్లో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్న విషయాన్ని లోకేశ్ గుర్తు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు,ర్యాలీలు చంద్రబాబు మచ్చలేని తనానికి, ఆయన చేసిన అభివృద్ధికి నిదర్శనమని నారా లోకేశ్(Nara Lokesh) చెప్పుకొచ్చారు. మాజీ సీఎం అరెస్టుపై ఇలా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరగడం ఇదే తొలిసారని అన్నారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని లోకేశ్ చెప్పారు.