CM Jagan tour: ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటన విశేషాలివే
AP CM Jagan Vizag tour schedule Fixed
ఏపీ సీఎం జగన్ మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారయింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలు దేరనున్నారు. నాలుగున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖకు బయలుదేరారు. రాత్రికి రుషికొండలోని ఓ హోటల్లో బస చేయనున్నారు.
మూడవ తేదీ ఉదయం 9 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వేదిక వద్దకు చేరుకోనున్నారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జీఐఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గోనున్నారు.మూడు గంటలకు ఎగ్జిబిషన్ ఎరేనాను ప్రారంభించనున్నారు. సాయంత్రం మూడున్నర నుంచి ఆరు గంటల వరకు ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు జీఐఎస్ అతిథుల కోసం గాలా డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ డిన్నర్ లో అతిధులతో పాలు సీఎం జగన్ పాల్గోనున్నారు.
నాల్గవ తేదీన ఉదయం 9 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ వేదిక దగ్గరకు సీఎం జగన్ చేరుకోనున్నారు. గంటన్నర పాటు ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలు జరగనున్నాయి. 11 గంటలకు వేలిడిక్టరీ సమావేశంలో పాల్గొననున్నారు. షెడ్యూల్ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత మధ్యాహ్నం రెండున్నరకు విశాఖ నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.