AP CM Jagan Viajaywada tour details
ఏపీ సీఎం జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గోనున్నారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంకు చేరుకుని శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరతారు. తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఏపీ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కొన్ని రోజుల క్రితం సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ప్రారంభం అయింది. 6 రోజుల పాటు జరిగే ఈ మహాయజ్ఞం రేపు ముగియనుంది.
వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు.
మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు యజ్ఞ కార్యక్రమా కొనసాగుతున్నాయి.
రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన
ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే శ్రీ లక్ష్మి మహా యజ్ఞం, అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం#CMYSJagan
— Rahul (@2024YCP) May 16, 2023