CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్..రేపు ప్రధానితో భేటీ
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని సమాచారం.
అలాగే ఆంద్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించనున్నారని సమాచారం. అలాగే పోలవరం నిధుల పైన ప్రధానితో చర్చ జరిపే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలుపుతున్నాయి. రేపుఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో ప్రధాని సమావేశం అనంతరం అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రిలో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను వారికీ జగన్ ఇవ్వనున్నారు.
సీఎం జగన్ అధ్యక్షతన ఈ మద్యే కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖకి వెళ్తున్నామని మంత్రుల వద్ద అన్నట్లు సమాచారం. దీంతో అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేంద్రపెద్దలతో రాజధాని కి సంబదించిన చర్చకూడ జరుగొచ్చని సమాచారం అందుతుంది.