AP CID Notices: నారాయణ కుటుంబానికి ఏపీ సీఐడీ నోటీసులు
AP CID Notices: రాజధాని అమరావతి ప్రాంత మాష్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వ్యవహారంలో అవకతవకల పై ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద మాజీ మంత్రి పి నారాయణ, నారాయణ భార్య పి.రమాదేవి, పి. ప్రమీల, రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసిన ప్రకారం మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు ఈ విషయంలో టెన్షన్ నెలకొంది. మార్చి 6న విచారణకు రావాలని జారీ చేసిన నోటీసులలో సీఐడీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పి. సింధూర, పి.శరని, అల్లుడు కె.పునీత్, కె.వరుణ్ కుమార్ లకు సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మార్చి నెల 7, 8 తేదీల్లో వీళ్ళను సీఐడీ విచారించనుంది.