AP CID: చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు
AP CID Notices: టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కి సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. భారతి పే కేసులో చింతకాయల విజయ్‌కు ఏపీ సీఐడీ పోలీసులు గతంలో కూడా నోటీసులు ఇచ్చారు. అప్పట్లో హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని విజయ్ నివాసానికి పోలీసులు వెళ్లిన సమయంలో విజయ్ ఇంట్లో లేకపోవడంతో.. ఇంట్లో పని చేసే సర్వెంట్ మీద రుబాబు చేశారని, ఆ తరువాత ఈ పిల్లల మీద కూడా దురుసుగా ప్రవర్తించారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక తాజాగా మరో సారి నోటీసులు ఇవ్వడమే కాక ఈ నోటీసుల్లో నెల 27న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొంది.
41 A కింద నోటీసులు ఇవ్వటానికి రీజనల్ సీఐడీ అధికారులు విజయ్ స్వగ్రామం నర్సీపట్నం వెళ్లారు. ఐతే అక్కడ విజయ్ అందుబాటులో లేకపోవడంతో అయ్యన్న సతీమణి, విజయ్ తల్లి పద్మావతికి నోటీసులు అందజేశారు అధికారులు. చింతకాయల విజయ్ టీడీపీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి ఆయన భారతి పే అంటూ ముఖ్యమంత్రి సతీమణి భారతి ఫొటోలతో పోస్టర్లు కొట్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే విజయ్ ను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.