AP CID Chief: ఏపీ సీఐడీ చీఫ్ బాధ్యతల నుంచి సునీల్ కుమార్ ఔట్!
AP CID Chief: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు స్థాన చలనం కలిగింది, ఏపీ స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీ సంజయ్ కి ఏపీ సీఐడీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మరోపక్క ఏపీ సీఐడీ సునీల్ కుమార్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా సంజయ్ కి ప్రభుత్వం అప్పగించింది. నిజానికి ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్‌కుమార్‌కు డీజీగా ప్రమోషన్ లభించింది. ఆయన డీజీ హోదాలో సీఐడీ చీఫ్‌గా కొనసాగుతారు అనుకుంటే ఆయనకు స్దాన చలనం కలగడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నిజానికి సునీల్ కుమార్ జగన్ కు నమ్మకస్తుడు అయిన అధికారి అనే పేరుంది. ఇలాంటి నేపథ్యంలో ఆయనను ఎందుకు బదిలీ చేశారనే చర్చ జరుగుతోంది, నారా లోకేష్ పాదయాత్ర ముందు ఆయనని బదిలీ చేయడం కూడా అనేక రాజకీయ చర్చలకు కారణం అవుతోంది.