AP Cabinet: 14వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet: ఈ నెల 14వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. 14వ తేదీ 12 గంటలకు భేటీ కానున్న కేబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలుపనుంది. ఇక గత నెలలో కూడా ఏపీ మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన అజెండాలోని అన్ని అంశాలకు ఏపీ కాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపి మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55 వేల కోట్లు పెట్టుబడికి అంగీకారం తెలిపింది. ప్రధానంగా ఆ భేటీలో 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించింది.