AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
AP Cabinet Decisions: ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ సదుపాయం కొనసాగింపు అంశంపై చర్చ జరిగింది. అలాగే జిల్లా గ్రంథాలయ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ చట్ట సవరణ బిల్లుపై కేబినెట్ లో చర్చ జరిగింది. అదే విధంగా ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ చట్ట సవరణ బిల్లుపై కేబినెట్ లో చర్చ జరిగింది. అలాగే హైస్కూళ్ళలో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోదం తెలిపిన క్యాబినెట్ వారికి నెలకు ఆరు వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. టాయిలెట్ నిర్వహణ నిధి నుంచి చెల్లించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు ర్యాటి ఫై చేసిన క్యాబినెట్ కేటాయింపులు కూడా నిర్ణయం తీసుకున్నారు. అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.