AP Budget session: ఫిబ్రవరి చివరి వారంలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు
AP Budet session will be held in the Next month itself
ఏపీ బడ్జెట్ సమావేశాల విషయంలో క్లారిటీ వచ్చేసింది.. ఫిబ్రవరి చివరి వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలను 20 నుంచి 25 రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఏపీలో రెండు కీలక అంతర్జాతీయ సదస్సులు ఉన్నాయి. వాటి షెడ్యూల్ తో విభేదించకుండా ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. సదస్సుల షెడ్యూల్, అసెంబ్లీ తేదీలు క్లాష్ కాకుండా కసరత్తు చేస్తోంది.
మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఉండగా, మార్చి 28, 29 జీ-20 వర్కింగ్ గ్రూప్ సదస్సు జరగనుంది. ఈ సమావేశాల షెడ్యూల్, బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ తో కలవకుండా ఉండే విధంగా బడ్జెట్ సమావేశాలను ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెడతారా లేదా అనే విషయంలో ఇంకా ఓ స్పష్టమైన ప్రకటన రాలేదు. దీనిపై అనేక రకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.