తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కౌంటర్ ఇచ్చారు. భారతీయ జనతాపార్టీపై కేసీఆర్ చేసిన అనేక ఆరోపణలను ఖండించారు. ఏ రాష్ట్రంలోనైనా వేరే పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరితే వారు పదవికి రాజీనామా చేసి గెలవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

మునుగోడు ఎన్నికల నేపధ్యంలో కేసీఆర్ డ్రామాలు ఆడి ఫైలయ్యారని మాధవ్ విమర్శించారు. తెలంగాణలో కూడా ఎవరన్నా చేరితే రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మరి కూరగాయలను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్నించారు. బిజెపి ఎప్పుడూ అటువంటి పనులు చెయ్యదని అన్నారు. కేవలం చిన్న విషయాలను కేసీఆర్ భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో టీఆర్‌ఎస్ పార్టీయే ఉంది కాబట్టి సీబీఐ విచారణకు ఆదేశించండని సవాలు విసిరారు.