Andhra Pradesh: కిరణ్ చేరిక బీజేపీ బలోపేతానికి దోహదపడుతుంది- సోము వీర్రాజు
AP BJP Chief Somu Verraju welcomes Kiran Kumar reddy entry into BJP
ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతించారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి చురుకైన నాయకుడని ప్రశంసలు కురిపించారు. కిరణ్ చేరిక రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి దోహదపడుతుందని, అతనికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని సోము వీర్రాజు అన్నారు.
శాసన మండలి ఎన్నికల ఓట్లలోని అవకతవకలపై కూడా సోము వీర్రాజు స్పందించారు. మండలి ఎన్నికలలో వైసీపీ ముందుగానే ఓటమిని అంగీకరించి నట్లు వుందని సోము వీర్రాజు అన్నారు. కనీసం పదవ తరగతి చదవని వారికి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో ఓటర్లుగా నమోదు చేయడం ప్రజాస్వామ్యనికి గొడ్డలి పెట్టు లాంటిదని మండిపడ్డారు. పెద్దల సభను కలుషితం చేయడం నైతికత కాదని అన్నారు.
గ్రాడ్యుయట్ కాని వారికీ ఓటు హక్కు కల్పించడంపై ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు వినియోగించడం సమంజసం కాదని సోము వీర్రాజు అన్నారు. సక్రమంగా ఎన్నికలు జరిగితే ప్రజలు బటన్ నొక్కి ప్రభుత్వానికి బుద్ది చెప్పుతారని సోము వీర్రాజు విమర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహకరిస్తోందని సోము వీర్రాజు తెలిపారు. ఇసుక , ఖనిజాలను వైసీసీ ప్రభుత్వం దోపిడీ చేస్తున్నదని ఆరోపించారు. విశాఖ పట్నంలో డబ్బులతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. బోగస్ ఓట్లు పై ఆధారాలతో ఇప్పటికే ఫిర్యాదు చేశామని వీర్రాజు గుర్తుచేశారు. జనసేన బిజెపి తోనే వుందని స్పష్టం చేశారు.