Somu Veerraju: మోహన్ బాబు కలిసిన సోము వీర్రాజు
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి పీక్ కు చేరింది. ఎన్నికలకు సమయం సమీపించడంతో ప్రలోభాలు కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలని లక్ష్యంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు తెలుగు దేశం పార్టీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తుపెట్టుకుంది. రెండో ప్రాధాన్య ఓటు తమ అభ్యర్థికి పడేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం
ఇక మరోవైపు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ నటుడు మోహన్ బాబుతో సొము వీర్రాజు సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో మోహన్ బాబు ను ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, రాయలసీమ అభివృద్ధి జరగాలన్నా బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.