Somu Veerraju: ఒకే రాజధాని మా విధానం.. సోము వీర్రాజు
Somu Veerraju: ఒకే రాజధాని మా విధానం అది అమరావతి ఇందుకోసం 5 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చెప్పడానికి చేయడానికి అర్హత ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని అన్నాడు. విశాఖలో ప్రశాంత వాతావరణం బీజేపీతోనే సాధ్యం అని పేర్కొన్నారు. హుదూత్ తుఫాన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖను ఆదుకున్న సంగతిని సోము వీర్రాజు వివరించారు. విశాఖ సుందరీకరణకు కేంద్రం చేసిన ఆర్థిక సహకారం గుర్తు చేశారు.
మేము అభివృద్ధి చేస్తోంటే ఇతర పార్టీలు రాజకీయాలు మాట్లాడుతున్నాయి ఎం జరగడం లేదని మాట్లాడుతున్నాయి అని అన్నారు. కేంద్రప్రభుత్వ సహకారం లేనిదే ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఇదంతా చేస్తుందా ?నిజాలు మాట్లాడాలని వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. కేంద్ర ఇచ్చిన నిధులతోనే రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి జరిగిందన్నారు. ఆయుష్ డిపార్ట్మెంట్ లో పెడింగ్ లో పెట్టిన అంశాలను భీమవరం సభలో తీర్మానం చేసింది మేము కదా అని ప్రశ్నించారు.
జగన్ ఈ రోడ్లపైనే పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు .ఇప్పుడు ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కనివ్వకుండా అక్రమ జీఓ ఇచ్చారు. నీకో న్యాయం ఇతరులకోన్యాయమా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు రాష్టంలో నెలకొన్నాయనిఅన్నారు. అలాగే బియ్యం పంపిణీ రూపంలో ఏటా 5వేల కోట్లు రాష్టం పక్కదారి పట్టిస్తోందని ఆరోపణ చేసారు. గిట్టుబాటు ధర రైతుకు ఇవ్వరు..నాణ్యమైన బియ్యాన్ని కొనరు..అలాగే కందిపప్పు పై కేంద్రం 50 రూపాయలు సబ్సిడీ ఇస్తుంటే దాన్ని వొదిలేసి పక్కదేశాలనుండి నాణ్యత లేని కందిపప్పును కొని అది ప్రజలకు ఇస్తున్నారని అన్నారు. ఇక మా రాజధాని అమరావతిమాత్రమే అని మరోమారు గుర్తుచేశారు. ఎవరేమన్నా మరో సంవత్సరం ఆతరువాత మూడురాజధానుల మాట పక్కకెళ్తుంది అమరావతి రాజదానవుతుంది అని అన్నారు.