Skill Development Scam: బాబు హయాంలో స్కాం.. అసెంబ్లీలో కీలక చర్చ!
Skill Development Scam: అసెంబ్లీలో చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై చర్చ జరిగింది. రాష్ట్రంలో మొదలైన విదేశాలకు సైతం ఈ కుంభకోణం పాకినట్టు తెలుస్తోంది. జీఎస్టీ, ఈడీ, సెబీల వరకు స్కాం పాకిందని, దేశం నుంచి విదేశాలకు దోచిన ప్రజాధనం తరలించారని చెబుతున్నారు. అక్కడ నుంచి హవాలా మార్గంలో తిరిగి దేశంలోకి తెప్పించారని, మొత్తం రూ.371 కోట్ల దోపిడీ జరిగనిదని చెబుతన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలలకే స్కాం మొదలయిందని, ముందుగానే తన మనుషులను స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో పెట్టిన చంద్రబాబు, సీమెన్స్ ముసుగు తొడిగి అక్కడ ఉద్యోగితో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కేవలం ఒక నోట్ ఆధారంగా స్పెషల్ ఐటెంగా కేబినెట్ ఆమోదం తెలిపిందని, ప్రాజెక్టు డీపీఆర్, సర్టిఫికేషన్ లేకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తేల్చారు.
90శాతం సీమెన్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా రూ.3356 కోట్ల ప్రాజెక్టుకు ఓకే చెప్పారని, జీవోలో ఇదే అంశాన్ని చంద్రబాబు సర్కారు పేర్కొన్నదని తేలింది. తీరా ఒప్పందం దగ్గరకు వచ్చే సరికి జీవోలో అంశాలు కనుమరుగయ్యాయని, ప్రభుత్వం ఇచ్చే దాన్ని ఆర్థిక సహాయంగా పేర్కొంటూ ఒప్పందం చేశారని, ఒప్పందంలో జీవో అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు అయ్యాయని తేలింది.
ఒక్క పైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల చేశారని, డబ్బు విడుదలకు ఆర్థికశాఖ అధికారుల అభ్యంతరాలు ఉంటె వాటిని కొట్టేసి.. తానే స్వయంగా చంద్రబాబు విడుదల చేసినట్టు చెబుతున్నారు. తర్వాత షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారని, జీఎస్టీ అధికారుల ఆరాతో చంద్రబాబు హయాంలోనే స్కాం వెలుగులోకి వచ్చిందని, తర్వాత ఈడీ, సెబీ సోదాలు జరిపి అవన్నీ షెల్ కంపెనీలుగా గుర్తించాయని అంటున్నారు. సీమెన్స్ గ్లోబల్ టీం ఒక్క పైసా కూడా మాకు ముట్టలేదని చెబుతూ మరిన్ని ఆధారాలను ఇచ్చినట్టు చెబుతున్నారు. కొంత డబ్బు హైదరాబాద్‌కు వెళ్లిందని ఆధారాలను సీమెన్స్ గ్లోబల్ టీం ఇచ్చిందని, ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలోనే వెలుగు చూసినా వాటన్నింటినీ చంద్రబాబు సర్కారు దాచేసిందని చెబుతున్నారు.,