AP Assembly Meetings: నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
AP Assembly Meetings: నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో నేడు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రపంగం అనంతరం బీఏసీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో సమావేశాలను ఎన్నిరోజులపాటు నిర్వహించాలి, సమావేశాల అజెండా ఏంటన్నది నిర్ణయిస్తారు. ఈ బీఏసీ సమావేశం పూర్తైన తరువాత ఏపీ కేబినెట్ భేటీ కానున్నది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సాధారణ బడ్జెట్‌ను, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించనున్నది. ఈ ఆమోదం అనంతరం బడ్జెట్ ను గవర్నర్‌కు పంపి ఆమోదింప చేయనున్నారు.
ఆ తరువాత ఈనెల 16వ తేదీ సాధారణ బడ్జెట్‌ను, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఏయే రంగాలకు ఎంత బడ్జెట్ కేటాయించారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర బడ్జెట్ కావడంతో అందరి దృష్టి ఈ బడ్జెట్ మీదనే ఉన్నది. సుమారు 2లక్షల 60వేల కోట్లకు పైగా ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంక్షేమానికే పెద్దపీట వేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు అమలు చేస్తున్నపథకాలతో పాటుగా మరికొన్ని పథకాలు కూడా అమలు చేసే అవకాశం ఉంది. కాగా, బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఏపీ సీఎం కీలక విషయాలపై ప్రసంగించే అవకాశం ఉంది.