AP Assembly: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. శనివారం కూడా?
AP Assembly: రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఇక గవర్నర్ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల అజెండా, పని దినాలను బీఏసీ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానున్నది. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు రానుండడంతో ఇవే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు అని చెప్పొచ్చు. ఎన్నికలు ఉన్న క్రమంలో వచ్చే ఏడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక ఈ నెల 18న సభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమావేశాల నేపథ్యంలో శనివారం కూడా అసెంబ్లీ పని చేయనుంది.