Tirumala: తిరుమల (Tirumala) శ్రీవారి కొండపై వరుసగా విమానాలు (Flights) ఎగరడం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా వరుసగా విమానాలు తిరుమల కొండపై నుంచి ఎగురుతున్నాయి.
Tirumala: తిరుమల (Tirumala) శ్రీవారి కొండపై వరుసగా విమానాలు (Flights) ఎగరడం కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా వరుసగా విమానాలు తిరుమల కొండపై నుంచి ఎగురుతున్నాయి. ఆగమశాస్త్రం నిబంధనలకు విరుద్ధంగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం ఉదయం ఓ విమానం తిరుమల కొండపై నుంచి ఎగిరిన విషయం తెలిసిందే. శనివారం కూడా మరో విమానం కొండపై నుంచి ప్రయాణించింది.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు (Indigo airlines) చెందిన ఓ విమానం శనివారం ఏకంగా గొల్ల మండపం మీదుగా వెళ్లింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రం నిబంధనల ప్రకారం తిరుమలను నో ప్లై జోన్‌గా (No fly zone) ప్రకటించాలని టీటీడీ (TTD) అధికారులు పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏవియేషన్ అధికారులకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించలేదు.
నో ఫ్లైజోన్‌గా ప్రకటించకపోయినప్పటికీ.. మౌళిక ఆదేశాలతో తిరుమలపై నుంచి విమానాలు వెళ్లకుండా జాగ్రత్త వహిస్తామని ఎయిర్పోర్ట్ అధికారులు గతంలో ప్రకటించారు. అయినా కూడా విమానలు తిరుమల కొండపై నుంచి ఎగురుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని టీటీడీ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తిరుమలకు నో ఫ్లైజోన్ ప్రకటిస్తే.. మిగతా ఆలయాల నుంచి కూడా డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారట.