Minister Appalaraju: ప్యాకేజి కోసమే పవన్ చంద్రబాబు వద్దకు వెళ్ళాడు..మంత్రి అప్పలరాజు
Minister Appalaraju: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించిన తర్వాత..చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ల మీద వైసీపీ నేతలు తమదైన స్టయిల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబు,రోజా, సజ్జల ఇలా పలువూరునేతలు స్పందించారు. తాజాగా మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ కు డబ్బు పిచ్చి పట్టుందని విమర్శించారు. ప్యాకేజి కోసమే పవన్ చంద్రబాబు వద్దకు వెళ్లాడని అన్నారు.
వారి కామెంట్స్ కు టీడీపీ , జనసేన నేతలు సైతం ఎదురు దాడికి దిగుతున్నారు. సంక్రాంతి మామూళ్ల కోసం వెళ్లాడంటూ మంత్రి అమర్నాథ్ ట్వీట్ చేయగా.. డూ డూ బసవన్నలా తల ఊపడానికి చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. మరికొంతమంది పలు రకాలుగా ట్వీట్స్ చేసారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసినా ఆశ్చర్యం లేదని అన్నారు.
సింగిల్ గా పోటీ చేసే దమ్ము వైసీపీ కి ఉంది.. మరి చంద్రబాబు, పవన్ లకు ఉందా? అని ప్రశ్నించారు. పవన్ మాట్లాడే ప్రతి మాటకు కచ్చితంగా ఒక రేటు ఉంటుందని విమర్శించారు. రాష్ట్రంలో నీచమైన రాజకీయాలకు పవన్ కేరాఫ్ అడ్రస్ గా మారారని దుయ్యబట్టారు. శ్రీకాకుళంలో జరిగే సభలో స్క్రిప్ట్ కోసమే చంద్రబాబును పవన్ కలిశారని చెప్పారు. ఎవరు ఎవరితో కలిసినా వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేసారు.