HC On Go 1: జీవో నెంబర్ 1 పై నేడు హైకోర్టు విచారణ..తీర్పుకు ఛాన్స్
AP High Court: చంద్రబాబు పాల్గొన్న కందుకూరు..గుంటూరు సభల్లో 8 మంది మరణించారు. దీంతో.. బహిరంగ సభలు.. రోడ్ షోల నిర్వహణ పైన ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా రోడ్ల పైన వీటి నిర్వహణకు అనుమతి నిరాకరించింది. ఈ జీవో జారీ పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిని విచారించిన న్యాయస్థానం 23 న (నిన్న) విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. విచారించిన సుప్రీంకోర్టు కేసు హైకోర్టులో విచారణలో ఉండగా తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును విచారించాలని సూచించింది. సుప్రీం సూచనలమేరకు నిన్న విచారణ చేపట్టింది ఏపీహై కోర్ట్.
హక్కులకు భంగం కల్గినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తరపు న్యాయవాది రాజు రామచంద్రన్ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. జీవో నెంబర్ 1 రాజ్యాంగ విరుద్దంగా ఉందని ఆయన వాదించారు. కోర్ట్ విచారణను ఈరోజుకు మరోసారి వాయిదా వేశారు. వెకేషన్ బెంచ్ పై సీజే ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది లంచ్ మోషన్ ఎందుకేశారని అంత ఆతృతంగా వేయాల్సిన పరిస్థితి ఎందుకు నెలకొంది అని ఫైర్ అయింది.గందర గోళం దేనికని పిటీషన్ దారుకు సూటి ప్రశ్నవేసింది. ఇక జీవో నెంబర్-1పై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖు చేశారు. దీంతో పిటిషన్లపై నేడు వాదనలు వినాలని సీజే బెంచ్ నిర్ణయించింది. ఈ జీవో ప్రకారంగా రోడ్లపై ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.