Global Investors Summit: నేటితో ముగియనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
Global Investors Summit: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతున్నధి. విశాఖ తీరంలో నిన్నమొదలై నేడు కూడా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 340 పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమ్మిట్ లో స్పష్టం చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇందులో ప్రధానంగా విద్యుత్ రంగంలో పెట్టుబడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిశ్రమలు, ఐటీ, టూరిజం వంటి కీలక రంగాల్లోనూ పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపించారు. ముఖేష్ అంబానీ, కరణ్ ఆదానీ, జీఎమ్మార్, ప్రతీ రెడ్డి వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలను ప్రశంసించారు. తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంవోయూలు.. కుదుర్చుకోగా నేడు మరో 248 ఎంవోయూలను కుదుర్చుకోనున్నారు. వీటి విలువ రూ.1.15 లక్షల కోట్లు. ఈ ఒప్పందాల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. నేడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద సోనోవాలా, రాజీవ్ చంద్రశేఖరన్ హాజరవుతున్నారు. పారిశ్రామిక రంగం నుంచి రెడ్డీస్ లాబోరేటరీ చైర్మన్ సతీష్ రెడ్డి, అపాచి హిల్ టాప్ హెడ్ సెరిగో లీ, బ్లెండ్ హబ్ వ్యవస్థాపకుడు హెన్ రిక్ స్టామ్ , వీస్పన్ గ్రూప్ ఎండీ రాజేష్ మందావే వాలా, భారత్ బయోటెక్ చైర్ పర్సన్ సుచిత్ర ఎల్లా, హెటిరో గ్రూప్స్ ఎండీ వంశీకృష్ణ తదితర పారిశ్రామిక వేత్లు పాల్గొననున్నారు.