AP BRS: ఏపీ బిఆర్ఎస్ లో భారీ చేరికలు
AP BRS: ఆంధ్రప్రదేశ్ కర్నూల్, ప్రకాశం, నంద్యాల జిల్లాల నుండి పలువురు మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రి ప్రశాంత్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ బిఆర్ఎస్ అధ్యక్షుడు తోటచంద్రశేఖరరావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి స్వాగతించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం తో దేశ ప్రజలందరి కళ్ళు తెలంగాణ వైపు చూస్తున్నాయని మంత్రి అన్నారు.
తెలంగాణాలో అమలవుతున్న పథకాలు దేశంలో మరో రాష్టంలో లేవని అన్నారు. అందుకే ప్రతిఒక్కరు బిఆర్ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ దేశ అవసరాల కోసమే టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిందన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో సంతోషంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీలో చేరినవారు కర్నూల్ జిల్లాకు చెందిన కార్పొరేటర్ ముస్తాక్ సాయి తేజ్, సర్పంచ్ రామాపురం ప్రకాశం, సలీంబేగ్, వెంకటేశం మాజీ ఎంపీటీసీలు పలువురు, మాజీ జెడ్పిటిసిలు కర్నూలు జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షురాలు రాధమ్మ తో పాటు పలువురు పార్టీలో చేరారు.