Anam Ram Narayana Reddy: ఆనం షాకిచ్చారా?.. ప్లేసు మార్చేశాడు ఏంటి?
Anam Ram Narayana Reddy: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయన్న సంగతి తెలిసిందే. అయితే తొలి రోజే సభలో ఒక ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేమంటే నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ సభ్యుల పక్కన కూర్చోవడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ ప్రసంగం కావడంతో ఉభయ సభలకు చెందిన సభ్యులు ఒకేచోటకు రావాలి. అందు వల్ల ప్లేసులు సరిపోక ఆయన జనరల్ గానే అక్కడ కూర్చున్నారా? లేక కొద్దిరోజుల నుంచి రెబల్ కామెంట్స్ చేస్తున్న క్రమంలో కావాలని టీడీపీ సభ్యులతో కలసి కూర్చున్నారా? అన్న సంగతి అసెంబ్లీ లాబీల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా అధికార వైసీపీని విభేదిస్తూ ప్రభుత్వం, పార్టీపై విమర్శలు చేయడంతో ఆనం రామనారాయణరెడ్డి రచ్చ చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గానికి జగన్ సమన్వయ కర్తగా నేదురుమిల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించడంతో ఆనం పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ప్రచారానికి తోడుగా వారి పక్కనే వెళ్లి కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.