Ambati Rambabu: ప్యాకేజీ పిల్లి…కూతలు.. నాగబాబుకు అంబటి కౌంటర్!
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక సీట్లు వైసీపీ గెలుచుకున్నా సరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పులివెందులకు చెందిన రాంగోపాల్ రెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఇది జగన్ కు తీరని అవమానం అనే చర్చ తెలుగుదేశం పార్టీ జనసేన తెరమీదకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కీలక నేత నాగబాబు వైయస్ జగన్ డైలాగుని ఇమిటేట్ చేస్తూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్ గతంలో వై నాట్ 175 అనే స్లోగన్ తెరమీదకు తెచ్చారు. అంటే 15 స్థానాలకు 175 స్థానాలు ఎందుకు గెలవలేము అంటూ ఆయన పార్టీ నేతలకు ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో పులివెందులకు చెందిన నేత ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడంతో వై నాట్ పులివెందుల అంటూ నాగబాబు ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారడంతో అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ప్యాకేజీ పిల్లి కూతలు కూస్తోంది అంటూ ఆయన నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు.