Ambati Rambabu: ముఖానికి రంగు వేయను, ప్యాకేజీ కోసం డాన్స్ చేయను- అంబటి రాంబాబు
Ambati Rambabu counter attack on Naga babu
జనసేన నేతలకు కౌంటర్ ఇవ్వడంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు తన సహచరులందరి కంటే ఓ అడుగు ముందే ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని, పవన్ సోదరుడు నాగబాబు గానీ వైసీపీ సర్కారుపై విమర్శలు చేయగానే అంబటి ఘాటుగా స్పందిస్తారు. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా నాగబాబుపై అంబటి సెటైర్లు వేశారు.
పండుగ సందర్భంగా అంబటి రాంబాబు సంబరాల్లో పాల్గొన్నారు. డాన్సులు వేశారు. తనదైన శైలిలో ఎంజాయ్ చేశారు. ఈ డాన్స్ ల విషయంలో నాగబాబు కామెంట్ చేశారు. అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అంటూ ఎద్దేవా చేశారు. పోలవరం విషయమై పలు సందేహాలు వ్యక్తం చేశారు.
నాగబాబు కామెంట్లపై అంబటి రాంబాబు ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. నువ్వు, నీ తమ్ముడు అన్నట్లు తాను సంబరాల రాంబాబునే అని అంబటి అంగీకరించారు. దానితో పాటు మరో కామెంట్ చేశారు. ముఖానికి రంగు వేయను, ప్యాకేజీ కోసం డాన్స్ చేయనని అంబటి రాంబాబు నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు.
నువ్వు, మీతమ్ముడు అన్నట్టు
"సంబరాల రాంబాబు"నే !
కానీ…ముఖానికి రంగు వేయను
ప్యాకేజి కోసం డాన్స్ చేయను ! @NagaBabuOffl@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2023