Ambati Rambabu: నేను మీ కన్నా వంద రెట్లు నిజాయితీపరుడ్నంటున్న అంబటి!
Ambati Rambabu on Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. గురువారం ఆయన ట్విట్టర్ లో కమీషన్ల కోసమే కాఫర్ డ్యాం లేకుండా డయాఫ్రం వాల్ కట్టారని ఆరోపించారు. ప్రాజెక్ట్‌లకు డబ్బులు వెచ్చించడం, వాటాలు కొట్టడం, దోపిడీలు చేయడం , దొడ్డిదారిన పదవులు చేపట్టడం మీకు మీ కుమారుడికి అలవాటేనని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను ఉద్దేశిస్తూ విమర్శించారు. నేను మీ కన్నా వంద రెట్లు నిజాయితీపరుడ్ని గుర్తుపెట్టుకోవాలని అంటూ మంత్రి అంబటి కౌంటర్ వేశారు. మరోపక్క సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించారు అంటూ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు, నిజానికి జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకోపోవడంతో ఆయన కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. ఆయన దాఖలు చేసిన ప్రైవేట్ కేసు ఆధారంగా కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదవగా ఆయన మీద విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు, నారా లోకేష్ లను టార్గెట్ చేశారు.