జనసేనది వరల్డ్ రికార్డ్.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ ఆరోపణలపై మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు డైరెక్షన్ లో మూడు నెలలుగా బ్రహ్మాండమైన సినిమా నడుపుతున్నారు. అది అట్టర్ ఫ్లాప్ అయిపోవడం ఖాయమని అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులను మోసం చేసింది చంద్రబాబు అనేది దత్తపుత్రుడు తెలుసుకోవాలని అన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనుసరించిన మోసపూరిత హామీలే కౌలు రైతుల ఆత్మహత్యలకు మూలమని, టీడీపీ హయాంలో కౌలురైతుల ఆత్మహత్యల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ వ్యవహరిస్తున్నారని, రైతులపై కాల్పులు జరిపిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తుంటేనే అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. చంద్రబాబు వలన, చంద్రబాబు చేత పుట్టిన పార్టీ జనసేన అని అన్నారు. చంద్రబాబు ఆలోచనలు,ఆశయాలు కోసం పనిచేయడం తప్ప జనసేనకు ఒక విధానం లేదని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ, వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ లేని వాడని. ఒక లోకల్, ఒక నేషనల్,ఒక ఇంటర్నేషనల్ ఇదీ పవన్ కళ్యాణ్ బహుభార్యత్వం తీరని అన్నారు. అక్రమంగా పెట్టిన కేసుల్లో 16 నెలలు జైల్లో ఉంటే నేరగాళ్లు అనడానికి పవన్ కళ్యాణ్ కు హక్కు ఎక్కడుంది? అని ప్రశ్నించారు. ఇక అతి తక్కువ కాలంలో ఎక్కువ పొత్తులు పెట్టుకున్న రాజకీయ పార్టీగా జనసేనది వరల్డ్ రికార్డ్ అని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని అన్నారు.