Woman Crew: విశాఖ టు రాయగడ, ఉమెన్ టీంతో స్పెషల్ ట్రైన్
All-women crew special train flagged off from Visakhapatnam
మహిళా దినోత్సవాన్ని దేశంలో పలు ప్రాంతాల ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళల కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేక కానుకలు అందిస్తున్నారు. వాల్తేరు డివిజన్లోని ఈస్ట్ కోస్టు రైల్వే కూడా మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. మహిళా ఉద్యోగులతో కూడిన ఓ ప్రత్యేక రైలును ప్రారంభించారు. ఇది విశాఖ పట్నం నుంచి రాయగడ వరకు ప్రయాణించనుంది.
ఈస్టు కోస్టు రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ పారిజాత సత్పతితో పాటు వైస్ ప్రెసిడెంట్ కవితా గుప్త, సెక్రటరీ ప్రియాంక శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాల్తేరు డివిజన్ గత కొన్నేళ్లుగా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. మహిళలకు అండగా నిలుస్తోంది. అదే విధంగా రైలులో ప్రయాణించే మహిళా ప్రయాణికుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. మేరీ సహేలీ అనే పేరుతో ఒక మహిళా టీమ్ ఏర్పాటు చేసింది. రైలులో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు సాయం చేసే ఉద్దేశ్యంతో మేరీ సహేలీ ప్రారంభం అయింది.
To mark #InternationalWomensDay , an all women crew special train flagged off from #Visakhapatnam to Rayagada, by Parijata Satpathy, President, @EastCoastRail Women’s Welfare Organisation (ECoRWWO), Waltair Division, @RailMinIndia .#AndhraPradesh #InternationalWomensDay2023 pic.twitter.com/9uFhRyPxDz
— Surya Reddy (@jsuryareddy) March 8, 2023
ALL WOMEN CREW PILOTS TRAIN FROM VISAKHAPATNAM TO RAYAGADA @RailMinIndia @EastCoastRail @DRMKhurdaRoad @DRMSambalpur @SCRailwayIndia @serailwaykol pic.twitter.com/vZsZyBUtjy
— DRMWALTAIR (@DRMWaltairECoR) March 8, 2023
Woman Crew