సరైన వానలు పడక అన్నదాతలు అల్లాడుతున్నారు. పంటలు ఎండిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇలాంటి సమయంలోనే కర్నూలు లోని ఓ రైతు కు తన భూమిలో వజ్రం కనిపించింది.
Kurnool: సరైన వానలు పడక అన్నదాతలు అల్లాడుతున్నారు. పంటలు ఎండిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇలాంటి సమయంలోనే కర్నూలు(Kurnool)లోని ఓ రైతు(Farmer)కు తన భూమిలో వజ్రం కనిపించింది. తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలోని రైతు పొలం పనులు చేస్తుండుగా కళ్ల ముందు జిగేల్ మనిపించేలా అత్యంత విలువైన వజ్రం(Diamond) దొరికింది.
దీంతో ఎంత సంబరపడిన ఆ రైతు..వజ్రాన్ని ఇంటికి తీసుకునివెళ్లి , చుట్టుపక్కల వారికి కూడా చూపించి సంతోషం పంచుకున్నాడు. దీంతో దానిని అమ్మి డబ్బులు చేసుకోవాలని కొంతమంది సలహా ఇవ్వగా.. స్థానిక బంగారు షాపు యజమానికి .. లక్షా 50వేల రూపాయలకు ఆ వజ్రాన్ని అమ్మేశాడు. అయితే ఆ తర్వాత బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని తెలిసి అయ్యో తొందరపడ్డానంటూ వాపోయాడు. అయితే ఏది ఏమయినా కాలం కలిసి రావడంతోనే.. లక్షన్నర రూపాయలు తనకు భూమాత ఇచ్చిందంటున్నాడు ఆ రైతన్న.