రాష్ట్రంలో వాతావరణ మారిపోయింది. సెగలు చిమ్మే వడగాలులు..అంతలోనే వర్షాలు భిన్న వాతావరణ అనుభూతులు కల్పిస్తున్నాయి.
Weather: రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. సెగలు చిమ్మే వడగాలులు..అంతలోనే వర్షాలు భిన్న వాతావరణ అనుభూతులు కల్పిస్తున్నాయి. మరో వైపు మండుటెండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి ప్రకటన చేసింది రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అందించిన చల్లని వార్త పెద్ద ఊరట నిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. గత రాత్రి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురవడంతో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని తెలుస్తుంది. ఇక తెలంగాణ లో మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే రెండురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతం నుంచి తమ గాలులు రాయలసీమ, కోస్తా జిల్లాల్లోకి వీస్తున్నాయి. ఈ ప్రభావంతో కోస్తాలోని జిల్లాలతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు ఈ చల్లటి వార్తతో ఉపశమనం పొందారు.
ఇక రెండు రాష్టాల్లో నిన్న భానుడు నిప్పుల కుంపటిగా మారాడు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 43.8 డిగ్రీలు, నెల్లూరు జిల్లా సీతారామపురంలో 43.5 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేటలో 43.3 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌లో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేంపల్లేలో 44.8, కొమరంభీం జిల్లా కెరమెరిలో 44.7, సిద్దిపేట జిల్లా చిట్యాల్‌లో 44.4, అదిలాబాద్ జిల్లా చాప్రాలలో 44.2,డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.