400 Maoist Sympathisers Surrenderd to Police in Sileru: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోల కదలికలు మొదలవుతున్న సమయంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 400 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. వీరిలో చాలా మంది మిలీషియా సభ్యులు కూడా ఉన్నారని అంటున్నారు. లొంగిపోయిన అనంతరం మావోయిస్టులు వీరికి ఇచ్చిన డ్రెస్సులు దహనం చేసి మావోలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అల్లూరి జిల్లా, ఒడిశాకు చెందిన మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. బీఎస్‌ఎఫ్ డీఐజీ వద్ద ఈ మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. ఏఓబీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లుగా మావోయిస్టు సానుభూతిపరులు తెలిపారు. ఇక కొన్నాళ్ల క్రితం అంటే రెండు నెలల క్రితం ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్లో శనివారం దాదాపు 700 మంది మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయారు. పోలీసులు ఆంధ్రహల్ గ్రామ సమీపంలో గల 65 బీఎస్ఎఫ్ బెటాలియన్ శిబిరం వద్ద సానుభూతిపరుల లొంగుబాటు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోరాపుట్ పోలీస్ డీఐజీ రాజేష్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ మదన లాల్ తదితరులు సమక్షంలో వివిధ గ్రామాల ప్రజలు లొంగిపోయారు.