టీడీపీలో యువతకు 40 శాతం సీట్లు
వచ్చే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత పై టీడీపీ ఆవిర్భావ వేడుకల సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 1983 లో వచ్చినట్లు మళ్ళీ యువత రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీకి మరో 40 ఏళ్లకు సరిపోయే నాయకత్వం ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తాను అని చంద్రబాబు ప్రకటించారు. సీనియర్ల ను గౌరవిస్తా…..యువతకు సీట్లు ఇస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ఉరుకులు పెట్టే యువతకే వచ్చే ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లు అని ప్రకటించిన చంద్రబాబు, టీడీపీ గెలుపు చారిత్రిక అవసరం అని యువత గుర్తించాలన్నారు. టీడీపీకి ప్రత్యేకత ఉంది. ఓ శుభ ముహూర్తాన పార్టీ పెట్టారు. ఎన్నో కష్టాలు వచ్చిన నిలదొక్కుకున్నామని, ఎన్టీఆర్ అధికారం కోసం పార్టీ పెట్టలేదు. ఉనికి లేని జాతి కోసం ముందుకు వచ్చారని అన్నారు. ఆవేశంలో పుట్టిన పార్టీ టీడీపీ. క్యాలిక్ లేషన్స్ తో పుట్టిన పార్టీ కాదని ఆయన అన్నారు. ప్రజల ఒంట్లో ప్రవహించేంది టీడీపీ రక్తమే, తెలుగువారి గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ముందు రాజకీయ నాయకులు వేలి ముద్రలు వేసే వాళ్ళు. కొందరు భూస్వాములు తమ తాబేదార్లకు అధికారం కట్టబెట్టేవారని ఆయన అన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కు కారణం నేనేనని పేర్కొన్న ఆయన ఊరికే హైటెక్ సిటీ నిర్మాణం అవుతుందా? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఎస్బీ హైదరాబాద్ కు తెచ్చింది నేనేనని అన్నారు. రాను అని చెప్పిన వారిని నా దగ్గరకు రప్పించుకొని ఆ తర్వాత తప్పించుకోకుండా ఉంచడం నాకు తెలుసని ఆయన కీలక కామెంట్స్ చేశారు. బయోటెక్నాలజీకి మంచి రోజులు వస్తున్నాయని ముందే ఊహించి జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేశామని, ఇప్పుడు జినోమ్ వ్యాలీలో కరోనకు వ్యాక్సిన్ తయారు చేయడం గొప్ప పరిణామమని అన్నారు. విజన్ 2020 తయారు చేస్తే ఈ 420లు నన్ను ఎగతాళి చేశారని ఆయన అన్నారు.