AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్!
అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు సస్పెండ్ చేసిన స్పీకర్ గవర్నర్ సభకు వచ్చిన సమయంలో నేరుగా స్పీకర్ ఛాంబర్ కు వెళ్లారని ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఏం జరిగిందో వివరించిన ప్రభుత్వం సభ ప్రతిష్ఠ దెబ్బ తీసేలా వ్యవహరించారంటూ సస్పెండ్ చేసింది. గవర్నర్ ముఖ్యమంత్రి కోసం నిరీక్షించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలికిన వీడియో సభలో ప్రదర్శించారు.
సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన కోరి, అసత్య ఆరోపణలు చేసిన ప్రచురించిన వారి పై చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. తగిన విధంగా నోట్ సిద్ధం చేసి తీసుకుని రావాలని స్పీకర్ సూచించారు. స్పీకర్ ఛాంబర్ లోకి గవర్నర్ రావటాన్ని తప్పు బట్టిన కేశవ్ కు థ్రోట్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్న గవర్నర్ వేడి నీళ్ళు అడిగారని బుగ్గన పేర్కొన్నారు. వాష్ రూమ్ కు వెళ్ళినా టీడీపీ సభ్యులు తుప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. కేశవ్ చేసిన ఆరోపణలను నిజం అని తేలితే ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకోవాలమొ.
కేశవ్ చెప్పకపోయినా ఈనాడు పత్రిక తప్పుడు వార్త రాసినట్లు అయితే రామోజీ రావు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని డిమాండ్ వచ్చింది. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు అయి వివరణ ఇవ్వాలని, కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వం పై రాస్తున్న తప్పుడు కథనాలు పతాక స్థాయికి చేరాయని అగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో మీడియా పాత్ర, వక్రీకరణ వార్తల పై చర్చ జరగాలని, గవర్నర్ పై కూడా తప్పుడు వార్తలు రాయడాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఫైర్ అయింది.