CM Jagan: ఛాంపియన్లకు సీఎం అభినందనలు
భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన థామస్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రీకాంత్‌పై ప్రశంసలు కురిపించారు. బదిరుల ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన కర్నూలుకు చెందిన షేక్ జాఫ్రిన్‌ను కూడా సీఎం జగన్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై ఏపీ ప్రతిష్టను ఎలుగెత్తి చాటడంపై ఇరువురి ప్లేయర్లను సీఎం అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని సీఎం జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్థాయిలో పతకాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. షేక్ జాఫ్రిన్ అర్హతలను బట్టి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజాతో పాటు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్ క్రిష్ణ, షేక్ జాఫ్రిన్ తండ్రి షేక్ జకీర్ అహ్మద్, శాప్ స్పోర్ట్స్ అధికారి జూన్ గ్యాలియట్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరపున సీఎం జగన్‌కు..ఏపీబీఏ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ బ్యాడ్మింటన్ కిట్ అందజేశారు.
సీఎం జగన్‌ను కలిసిన అనంతరం కిదాంబి శ్రీకాంత్ సంతోషం వ్యక్తం చేశాడు. 2024లో జరగనున్న ఒలింపిక్స్ పోటీలపై తన ఫోకస్ అంతా ఉందని తెలిపాడు. ఒలింపిక్స్ పోటీల్లో భారత్ తరపున పతకం సాధించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు.