ఈనెల 28న కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జగరబోతున్నది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అన్ని పార్టీలకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ లేఖలు రాసింది. ఇన్విటేషన్లు పంపింది. అయితే, పార్లమెంట్ భవనం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న తరుణంలో ప్రతిపక్షాలు మెలికలు పెట్టాయి
YSRCP on Parliament Opening: ఈనెల 28న కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జగరబోతున్నది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అన్ని పార్టీలకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ లేఖలు రాసింది. ఇన్విటేషన్లు పంపింది. అయితే, పార్లమెంట్ భవనం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న తరుణంలో ప్రతిపక్షాలు మెలికలు పెట్టాయి. రాష్ట్రపతి ఉండగా మోడీ చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకోవడం అనైతికమని, ప్రజాస్వామ్యానికి విరుద్దమని తాము ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేమని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొన్నది. అనంతరం 19 ప్రతిపక్ష పార్టీలు కూడా అదే బాటలో కార్యక్రమానికి హాజరుకాలేమని చెబుతూ ట్వీట్ చేశాయి.
కాగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పార్లమెంట్ ఓ దేవాలయం వంటిది. ఇలాంటి దేవాలయం ప్రారంభోత్సవానికి హాజరవడం పార్టీల విధేయతకు తార్కాణం. వ్యక్తిగత, రాజకీయ కక్ష్యలకు ఇది సమయం కాదని, పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకాలేమని చెప్పడం ధర్మం కాదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. హాజరయ్యే విషయంపై ప్రతిపక్షాలు మరోసారి ఆలోచించాలని వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైసీపీ హాజరవుతున్నట్టు తెలియజేశారు.
రాబోయే తరాలకు అనుగుణంగా పార్లమెంట్ నిర్మాణం జరుపుకోవడం గొప్ప విషయంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అంశంపై బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవలసి ఉంది. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పైగా ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. హాజరుకాలేమని ప్రకటించిన అనేక పార్టీల అధినేతలతో ఇప్పటికే కేసీఆర్ అనేకమార్లు చర్చలు జరిపారు. కేంద్రంలో మోడీ సర్కార్‌ను గద్దెదించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ ప్రతిపక్షాలను కాదని ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేక బాయ్‌కాట్ చేస్తారా చూడాలి.