ట్రెండ్‌ను ఫాలో అవ్వను... ట్రెండ్ సెట్ చేస్తాను... ఇది పవన్ కళ్యాణ్ డైలాగ్... దీనిని వైసీపీ నిజం చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో #YSRCPAgain2024 పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసింది. ఈ ట్యాగ్ క్రియేట్ చేసి నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్‌లోకి వెళ్లింది.
YSRCP Again 2024: ట్రెండ్‌ను ఫాలో అవ్వను… ట్రెండ్ సెట్ చేస్తాను… ఇది పవన్ కళ్యాణ్ డైలాగ్… దీనిని వైసీపీ నిజం చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో #YSRCPAgain2024 పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసింది. ఈ ట్యాగ్ క్రియేట్ చేసి నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్‌లోకి వెళ్లింది. జాతీయ స్థాయిలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఈ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటం విశేషం. నాలుగేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, రాజకీయంగా సాధించిన విజయాలు తదితర అంశాలను వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సీఎంగా వైఎస్ జగన్ సామాన్య ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలకు వస్తున్న ఆదరణ తదితర అంశాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాలు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా వైసీపీ సోషల్ సైన్యం పోస్ట్ చేస్తున్నారు.
ఈ హ్యాష్ ట్యాగ్ కేవలం పది నిమిషాల్లోనే ట్రెండింగ్‌లోకి రావడం, జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలవడంతో వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు చేస్తున్న ట్వీట్లలో మెరుగైన వాటిని కార్యకర్తలు సేకరిస్తున్నారు. వీటిని ప్రతిపక్షాలపై ప్రయోగించేందుకు అస్త్ర శస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను వైసీపీ బలంగా ఉపయోగించుకుంటున్నది. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలోనూ సోషల్ మీడియా ప్రధాన పాత్రను పోషించింది. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ సాగిన పాదయాత్ర పాటకు విశేషమైన ఆదరణ లభించింది. ప్రస్తుతం సంక్షేమాలు అమలు చేస్తున్న జగన్ వైనాట్ 175 పేరుతో నేతలు ప్రచారానికి సిద్దమౌతున్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరోసారి అధికారంలోకి వచ్చేలా చేస్తున్నాయని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. మరి ఈ పథకాలు జగన్‌ను అధికారంలోకి తీసుకొస్తాయా…చూడాలి.