వైఎస్ వివేకానంద హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ అఫిడవిట్లో సీబీఐ పేర్కొన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అఫిడవిట్లో సీబీఐ సీఎం వైఎస్ పేరును ప్రస్తావించడంపై జగన్ తరపు న్యాయవాదులు తీవ్రమైన అభ్యంతరాలు తెలియజేశారు.
Viveka Case: వైఎస్ వివేకానంద హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ అఫిడవిట్లో సీబీఐ పేర్కొన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అఫిడవిట్లో సీబీఐ సీఎం వైఎస్ పేరును ప్రస్తావించడంపై జగన్ తరపు న్యాయవాదులు తీవ్రమైన అభ్యంతరాలు తెలియజేశారు. వివేకా హత్య విషయం ముఖ్యమంత్రికి ముందే తెలుసునని సీబీఐ పేర్కొనడంతో పాటు ఆయన పేరును అఫిడవిట్లో ప్రస్తావించింది. ఈ ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రదుమారం రేపుతున్నది. సీబీఐ పేర్కొన్న అంశాలపై న్యాయపోరాటం చేయాలని సీఎం లీగల్ టీమ్ ఆలోచిస్తోంది. ఈ విషయంలో సీఎం ఇచ్చే ఆదేశాలను అనుసరించి లీగల్ టీమ్ చర్చలు ఉండవచ్చు. అయితే, సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ వెనుక కుట్ర కోణం ఉందని న్యాయవాదులు అనుమానిస్తున్నారు.
వివేకా హత్య విషయం 2019 మార్చి 15వ తేదీ ఉదయం 6:15 గంటల కంటే ముందే తెలుసునని, వివేకా పీఏ చెప్పకముందే వివేకా హత్య విషయం జగన్‌కు తెలుసునని సీబీఐ అనుబంధ కౌంటర్లో పేర్కొన్నది. వివేకా హత్యకు ముందు, హత్య తరువాత అవినాష్ రెడ్డి యాక్టీవ్ గా ఉన్నారని, వివేకా హత్య విషయం జగన్‌కు అవినాష్ చెప్పాడా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉందని సీబీఐ అఫిడవిట్లో పేర్కొన్నది.
సీబీఐ దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్లో మరికొన్ని కీలక అంశాలను సీబీఐ ప్రస్తావించింది. అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేయాల్సి ఉందని, ఈ విచారణ జరిగితేనేగాని మరికొన్ని కీలక విషయాలు బయటకు రావని సీబీఐ పేర్కొన్నది. అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని కూడా అఫిడవిట్లో ప్రస్తావించింది. హత్య వెనుక భారీ కుట్ర ఉందనే విషయం వెల్లడి కావాల్సి ఉందని, హత్య జరిగినరోజు అర్థరాత్రి 12:27 నుంచి ఉదయం 1:10 గంటల వరకు అవినాష్ వాట్సప్ కాల్స్ మాట్లాడారని ఈ విషయాలన్నీ కస్టోడియల్ విచారణలోనే బయటపడతాయని సీబీఐ పేర్కొన్నది.
సీబీఐ అఫిడవిట్ వ్యవహారం ఏ స్థాయిలో చర్చకు దారితీస్తుందో చూడాలి. ఇప్పటికే అవినాష్‌ను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ తీవ్రంగా ప్రయత్నం చేస్తుండగా, కర్నూలు పోలీసులు సహకరించడం లేదు. అటు అవినాష్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద బైఠాయించి నిరసనలు చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే, ఈరోజు అవినాష్ అంశంపై క్లారిటీ వస్తుందని అందరూ అనుకున్నారు. ఉదయం నుంచి ఈ కేసులో అవినాష్ లాయర్లు వాదనలు వినిపించారు. సాయంత్రం వరకు వాదనలు కొనసాగాయి. సాయంత్రం వైఎస్ సునీతా తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అప్పటికే సమయం మించిపోవడంతో సీబీఐ తరపు న్యాయవాదుల వాదనలను రేపు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. రేపటితోనైనా అవినాష్ ముందస్తు బెయిల్ వ్యవహారం కొలిక్కి వస్తుందా లేదంటే మరోసారి వాయిదా పడుతుందా చూడాలి.