రేపటి నుంచి రెండు రోజులపాటు మహానాడు సభలు జరగనున్నాయి. ఈ సభలను రాజమండ్రి శివారు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. రేపు ఉదయం నుంచి సమావేశాలు జరగనున్నాయి.
TDP: రేపటి నుంచి రెండు రోజులపాటు మహానాడు సభలు జరగనున్నాయి. ఈ సభలను రాజమండ్రి శివారు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. రేపు ఉదయం నుంచి సమావేశాలు జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే, ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన కోడెల శ్రీనివాసరావు మరణించిన తరువాత ఆ నియోజక వర్గం నుంచి ఎవర్ని బరిలోకి దించాలనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది.
చాలా మంది ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే చంద్రబాబు కూడా సంకేతాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. సత్తెనపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కన్నాకు కల్పించబోతున్నామని, పార్టీ కార్యకర్తలు నేతలు ఆయనకోసం పనిచేయాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి నియోజక వర్గ కార్యకర్తలకు తెలియజేశారని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై చంద్రబాబు నాయుడు రేపటి మహానాడులో చర్చించే అవకాశం ఉంది. దీనిపై చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. కొంతకాలంపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే, పార్టీ అధ్యక్షుడిగా పెద్దగా రాణించింది లేదు. పైగా ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుకు, కన్నా లక్ష్మీనారయణకు మధ్య విభదాలు తలెత్తాయి. దీంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి పచ్చకండువా కప్పుకున్నారు. టీడీపీ నుంచి స్పష్టమైన హామీ ఉండటంతోనే ఆయన సైకిలెక్కినట్టుగా వార్తలు వస్తున్నాయి.