Sajjala in Amaravati: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి గ్రామాల్లో పర్యటించారు. ఆర్ 5 జోన్ లే అవుట్ లను పరిశీలించారు. చంద్రబాబు తన హయాంలో ఎక్కడ భూమి ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేసారు. ఒక సెంటు ఇచ్చినా చూపించమని అడుగుతున్నామని..చూపిస్తే స్వయంగా క్షమాపణ చెబుతామన్నారు. సజ్జల పర్యటన సమయంలో స్థానిక రైతులు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఆర్ 5 జోన్ వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేసారు. ఈ నెల 26న సీఎం జగన్ ఆర్ 5 జోన్ లో ఇంటి స్థలాలను పంపిణీ చేయనున్నారు.
చంద్రబాబు తాను ఇచ్చిన స్థలాలను చేపించలేకపోతే తాను అబద్దాలు చెప్పానని చంద్రబాబు ఓపెన్ గా అంగీకరించాలని సజ్జల డిమాండ్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ళు సిద్ధం అయ్యాయని వెల్లడించారు. 30 వేల కోట్లు వెచ్చించి భూమి కొనుగోలు చేశామని చెప్పారు. ఇది ఒక మహా యజ్ఞంగా పేర్కొన్నారు. సైంధవుల్లా పేదలకు స్థానం లేకుండా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు మాష్టర్ ప్లాన్ లో తన వర్గం మినహా మిగిలిన వారు ఎవరూ ఉండకుండా చూశారని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను ముఖ్యమంత్రి జగన్ అడ్డుకుని పేదలకు, బలహీన వర్గాలకు ఇళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.
కోర్టులకు కూడా వెళ్ళి అడ్డుకోవాలి అనుకున్నారని సజ్జల ఆరోపించారు. దురాలోచన, దుగ్ద, కడుపుమంట, తిట్లు, బూతులు అన్నీ వీరి స్వభావాన్ని అద్దం పడుతున్నాయన్నారు. లే అవుట్ల మార్గదర్శకాలకు అనుగుణంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంతంలో లే అవుట్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.. ప్రైవేటు లే అవుట్లు కూడా ఇంత చక్కగా ఉండవని ప్రశసించారు.. లేఅవుట్లలో 62 శాతం రోడ్లు, ఓపెన్ స్పేస్ గా వదిలాం.. ఇంటర్నల్ రోడ్ల కోసం 36 శాతం భూమి కేటాయించామని వివరించారు. మొత్తం స్థలంలో 38 శాతం మాత్రమే ప్లాటింగ్ చేశాం అని వెల్లడించారు. అమరావతి ప్రాంతంలో లే అవుట్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.
అన్ని సదుపాయాలు వీటిలో ఉన్నాయి.. వీటిని స్లామ్ అనటానికి నోరు ఎలా వస్తుందో అర్ధం కావటం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీతో పాటు వామపక్షాలు కూడా అనటం ఆశ్చర్యంగా ఉందన్న ఆయన.. చంద్రబాబు టిడ్కో ఇళ్ళల్లో మౌలిక సదుపాయాల గురించి ఆలోచించలేదన్నారు. అప్పు రూపంలో ప్రజలపై భారం వేశారు.. మూడు లక్షల ఇళ్ళు ఇచ్చాను అని చంద్రబాబు అంటున్నాడు.. ప్రజల రక్తం పీల్చి తనకు కావాల్సిన డబ్బులు దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ డొక్క అమరాతిలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు పైన చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు.