వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణకు అప్పగించాలంటూ సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ అఫిడవిట్లో సీఎం వైఎస్ జగన్ పేరును చేర్చడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.
Sajjala: వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణకు అప్పగించాలంటూ సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ అఫిడవిట్లో సీఎం వైఎస్ జగన్ పేరును చేర్చడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. వైఎస్ వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలుసునని, అయితే, ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అనే కోణంలో విచారణ చేయాలని, దానికోసం అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేపట్టాలని కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
కాగా, ఈ కౌంటర్ అఫిడవిట్‌పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫిడవిట్లో జగన్ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అఫిడవిట్‌పై దర్యాప్తు చేయాలని, సీబీఐ విపరీత ధోరణికి, సెన్సేషనలైజేషన్‌కు ఇది నిదర్శనమని సజ్జల పేర్కొన్నారు. సీబీఐ దిగజారిపోయి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎల్లో మీడియాలో ప్రచారం జరుగుతున్న విధంగానే సీబీఐ కౌంటర్లు, కౌంటర్ అఫిడవిట్లో అంశాలు పేర్కొంటున్నారని, ఎల్లో మీడియాకు ముందుగానే ఈ అంశాలు ఎలా తెలుస్తున్నాయని మండిపడ్డారు.
దర్యాప్తు సంస్థ ఆరోపణలకు ఆధారాలు చూపాలని, చూపకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. సీబీఐ కౌంటర్లో పేర్కొన్న అంశంలో హెతుబద్దత లేదని, ముందుగా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో అవినాష్ రెడ్డి పేరు లేదని సడెన్‌గా ఆయన పేరును కౌంటర్లో దాఖలు చేసి విచారించాలని అంటున్నారని మండిపడ్డారు. కేసు విచారణ మొదలుపెట్టిన ఏడాదిన్నర తరువాత విచారణ పేరుతో భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌చేశారని, ఇప్పుడు అదే విధంగా అవినాష్ రెడ్డిని కూడా విచారణ పేరుతో అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, జగన్ పేరును అఫిడవిట్లో ప్రస్తావించడానికి కూడా ఇదే కారణమై ఉంటుందని సజ్జల పేర్కొన్నారు.