అవినాష్ రెడ్డి అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రచ్చ అవుతున్నది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా చేయరా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు విమర్శలు చేశాయి.
Perni Nani on Avinash Issue: అవినాష్ రెడ్డి అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రచ్చ అవుతున్నది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా చేయరా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు విమర్శలు చేశాయి. తెలుగుదేశం పార్టీ విమర్శలను వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఆక్టోపస్ అని విమర్శించారు. సీజన్లో వచ్చే వర్షంలా పవన్ కళ్యాణ్ వచ్చిపోతున్నారని పేర్నినాని విమర్శించారు. చంద్రబాబు అప్పట్లో మోడీతో తగాదా పెట్టుకున్నారని, 2014 నుంచి 2019 మధ్య అప్పటి ప్రభుత్వం జీవో 176ను తీసుకొచ్చిందని, సీబీఐకి చంద్రబాబు ప్రభుత్వ జనరల్ కంసెంట్ను రద్దు చేస్తూ జీవో విడుదల చేసిందని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినాష్ రెడ్డి కేసు విషయంలో టీడీపీ, వారి మీడియా చిలవలు, వలవలు చేస్తున్నారని, ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు అంటూ వార్తా కథనాలు రాస్తున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు. అవినాష్ విషయంలో తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు. సీబీఐ పిలిచినప్పుడల్లా అవినాష్ రెడ్డి విచారణకు వెళుతూనే ఉన్నారని, తల్లికి హార్ట్ ఎటాక్ రావడంతో దగ్గర ఉండి చూసుకోవడం కోసం వెసులుబాటు కావాలని సీబీఐని అడగటం తప్పా అని ప్రశ్నించారు. కేంద్రబలగాలు హెలికాఫ్టర్లో వచ్చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అవినాష్ రెడ్డిని కాల్చేస్తున్నారని ఊదరగొడుతున్నారని, రామోజీరావును సీఐడీ వాళ్లు కాల్చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంతవరకు ఎప్పుడైనా విచారణకు హాజరయ్యారా అని ప్రశ్నించారు. చంద్రబాబు జీవితమంతా స్టే లు తెచ్చుకొని బతికేస్తున్నారని, అవినాష్ విషయంలో ఎందుకు ఇంత కడుపు మంట ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.