ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు వరస భేటీలతో బిజీ కానున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు వెళ్తున్నారు. ఉదయం శ్యామలానగర్లోని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఇంటికి వెళ్లనున్నారు.
YS Jagan Key Meeting: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ వరుస భేటీలతో బిజీ కానున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు వెళ్తున్నారు. ఉదయం శ్యామలానగర్లోని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఇంటికి వెళ్లనున్నారు. మద్దాలి గిరిధర్ కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. కుటుంబాన్ని పరామర్శించిన వెంటనే జగన్ గుంటూరు నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు చేరుకుంటారు. గుంటూరు నుంచి తిరిగి వచ్చిన తరువాత ఉదయం 11 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అత్యంత కీలకం కావడంతో సీఎం జగన్ గుంటూరు పర్యటనను రెండు గంటల్లోనే ముగించుకోవలసి వస్తున్నది.
ఉదయం 11 గంటలకు నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగునున్నది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నీతి అయోగ్ ముందు ఉంచాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఏయే అంశాలను ఉంచాలి, ఎన్ని అంశాలను ఉంచాలనే దానిపై చర్చించనున్నారు. ఈనెల 27వ తేదీన ఢిల్లీలో నీతి అయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందని ముఖ్యమంత్రులు, ఇతర నేతలు హాజరవుతారు. ఆర్థిక ప్రణాళిక సంఘం స్థానంలో కేంద్రం నీతి అయోగ్ను తీసుకొచ్చింది. నీతి అయోగ్ ద్వారానే రాష్ట్రాలకు అవసరమైన నిధులను, రాష్ట్రంలోని సమస్యల పరిష్కారాలను చూపిస్తుంది.