CM Jagan In Bandar: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. పేదల ఇళ్లను దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా సీఎం వైయస్ జగన్ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్ ఆవిష్కరించారు. తపసిపూడిలో భూమి పూజ చేసి పైలాన్ ఆవిష్కరించారు. తరువాత జరిగిన సభలో సీఎం జగన్ బందరు వాసుల కలను నెరవేర్చామని పేర్కొన్నారు.
బందరు పోర్టు నిర్మాణానికి గ్రహణాలు తొలిగిపోయాయని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. రాష్ట్రంలోని నాలుగు పోర్టుల ద్వారా లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని వివరించారు. రూ 420 కోట్లతో ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. పేదల కోసం ప్రభుత్వం మంచి చేస్తుందన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పైన విమర్శలు గుప్పించారు. టీడీపీకి గజ దొంగల ముఠా తోడైందని వ్యాఖ్యానించారు. వీళ్లకు దోచుకోవటం..దాచుకోవటం..తినుకోవటం పనంటూ ఎద్దేవా చేసారు. అమరావతిలో పేదలకు ప్రవేశం లేని గేట్వే కమ్యూనిటినీ ప్రభుత్వ సొమ్ముతో కట్టుకోవాలని చూశారని ఆరోపించారు. అమరావతి పేరుతో సామాజిక అన్యాయం చేసారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
Ys Jagan
అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకుంది ఈ చంద్రబాబే అని విమర్శించారు. చంద్రబాబుకు మానవత్వమే లేకుండా పోయిందన్నారు. పేదలకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. టీడీపీకి గజదొంగల ముఠా తోడైంది.. ఈ ముఠా సభ్యులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, ఓ దత్తపుత్రుడు. వీళ్లెవరూ పేదల వద్దకు వచ్చి మంచిచేశాం ఓట్లేయండని అడిగే దమ్ములేదన్నారు. చంద్రబాబు నాయుడుకు పేదల కష్టాలు తెలుసా? అని ప్రశ్నించారు. పేదల తలరాతను మార్చాలని నిర్ణయించామని, అమరావతిలో 50వేల మంది పేదలకు ఈనెల26వ తేదీన ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామని ప్రకటించారు. ప్రతీ ఇంట మంచి జరిగిందని భావిస్తే తీడుగా నిలవండి అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.
పేదల ఇళ్లను దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు అని జగన్ మండిపడ్డారు. ఇప్పటి వరకు తన ప్రభుత్వ హాయంలో 2.10 లక్షల కోట్లు విలువైన పథకాలను లబ్దిదారులకు అందించామని వెల్లడించారు. ఇంగ్లీషు మీడియం స్కూళ్లను పేదలకు అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేసారని ఆరోపించారు. పేదలను ఆదుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడు రాలేదన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు మద్దతుగా నిలుస్తున్నవారు వీరందరూ ఏకమైతే ..మంచి చేసిన చరిత్ర ఉన్న మీ బిడ్డ ఎన్నికల్లో గెలవడమే కష్టమట అంటూ జగన్ పేర్కొన్నారు. గుండెలపై చేతులు వేసుకొని,ఒక్కసారి ఆలోచన చేసి మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే..మీ బిడ్డకు తోడుగా మీరే సైనికులుగా నిలబడండి అని సీఎం జగన్