ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ముందస్తుగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి.
Chandrababu Vs YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ముందస్తుగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని, ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నప్పటీకీ జగన్ ముందస్తు ఆలోచనతోనే ఉన్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ధైర్యం ఉంటే వెంటనే ఎన్నికలు పెట్టాలని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, లేశమాత్రమైనా అభివృద్ధి జరగడంలేదని అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ప్రాజెక్టుల కోసం పేదలను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. వారికోసం తాము న్యాయపోరాగటం చేశామని, కోర్టులు కూడా తప్పులు జరిగాయని చెప్పిందని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి భూముల విషయంలోనూ పెద్ద ఎత్తున రగడ జరుగుతున్నది. రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే, వాటిని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేస్తోందని, భూములు ఇచ్చుకుంటూ పోటే రాజధానికి భూములు ఉండవని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడినుంచి వచ్చినవారైనా ఇళ్లు కట్టుకోవడానికి అనుకూలంగా 5శాతం రిజర్వ్ చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ భూములను పేదలకు సెంటు చొప్పున పంపిణీ చేస్తున్నారని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్టును వ్యతిరేకించారని, కానీ ఇప్పుడు జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారని అన్నారు.