రెండువేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈరోజు దీనిపై ఆర్బీఐ ప్రకటన చేసింది. 2023, సెప్టెంబర్ 30 వరకు దేశంలోని 2 వేల రూపాయల నోట్లను వెనక్కితీసుకోనున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా కొందరు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu on Currency Notes: రెండువేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈరోజు దీనిపై ఆర్బీఐ ప్రకటన చేసింది. 2023, సెప్టెంబర్ 30 వరకు దేశంలోని 2 వేల రూపాయల నోట్లను వెనక్కితీసుకోనున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా కొందరు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఈరోజు అనకాపల్లి రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు కరెన్సీ నోట్లను వెనక్కి తీసుకునే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీకి సంబంధించిన రిపోర్ట్‌ను తానే ఇచ్చానని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని, ఖర్చు చేసిన దానికి కొండంతలుగా అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకుంటున్నారని విమర్శించారు. మనీలాండరింగ్ నియంత్రణ తగ్గాలని తాను బలంగా కోరుకున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని అన్నారు. రాజకీయంగా అవినీతి తగ్గాలంటే రూ. 2వేలు, రూ. 500 నోట్లు రద్దు కావాలని అన్నారు.
నోట్ల రద్దు అంశంతో పాటు చంద్రబాబు అవినాష్ రెడ్డి అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్, సీఐడీ, సీబీఐ వంటి పలు సంస్థలు వివేకానందరెడ్డి కేసును చేధించలేకపోయారంటే దాని వెనుక మాస్టర్‌మైండ్ ముఖ్యమంత్రి ఉన్నారని, బాబాయి కిల్లర్ మీద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయవచ్చని అన్నారు. అదేవిధంగా లులూ కంపెనీలో వాటా ఇవ్వలేదని ఆ కంపెనీని అక్కడి నుంచి తరమికొట్టారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరకు రైతుకు గిట్టుబాటు ధరను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రోడ్ షోలో డ్రోన్ లను ఎగరవేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జనాలను చూసి వైసీపీకి భయం పట్టుకుందని, అందుకే డ్రోన్లను అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు.