సీబీఐ అధికారులు కర్నూలు..విచారణకు హాజరు కావాలి...నోటీసులు ఇస్తారా - అరెస్ట్ చేస్తారా...
అర్థరాత్రి నుంచి కర్నూలులో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్ వివేకా కేసులో సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అవినాశ్ అనుచరులు, పార్టీ కార్యకర్తలు కర్నూలుకు చేరుకున్నారు. మరో వైపు అవినాశ్ తల్లి చికిత్స పొందుతన్న విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న అవినాశ్ ను లొంగిపోయేందుకు సహకరించాలని కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీకి వివరించారు. ఈ నెల 27 వరకు విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు అవినాశ్ రెడ్డి లేఖ రాశారు.
అవినాశ్ అరెస్ట్ పై ఊహాగానాలు కొనసాగుతుండగా రేపు సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. జేకే మహేశ్వరి, నరసింహన్ ధర్మాసనం అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతుంది. హై కోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్ ను విచారించేలా
చూడాలని అవినాశ్ తన పిటిషన్ లో కోరారు, తన తల్లి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు వారంపాటు మినహాయింపు ఇవ్వాలని తన పిటిషన్ లో అవినాష్ అభ్యర్థించారు. దీంతో పాటు హై కోర్టులో తన బెయిల్ వ్యవహారంపై విచారణ పూర్తయ్యే వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకుండా సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్ రెడ్డి ఆ పిటిషన్ లో కోరారు.
ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాల మధ్య కర్నూ లులో టెన్షన్ కొనసాగుతోంది. ఏం చేయాలా అని సీబీఐ అధికారులు గందరగోళంలో ఉన్నారు. జిల్లా ఎస్పీ ని కలసి రెండు సార్లు చర్చలు జరిపారు. అవినాశ్ లొంగిపోవాలని చెప్పాలంటూ ఎస్పీని కోరారు. దీనిపై ఎస్పీ ఏం చెప్పారన్నది క్లారిటీ లేదు. అయితే డీజీపీ సలహా తీసుకున్నాక ఈ అంశంపై స్పష్టత రావచ్చని తెలుస్తోంది.
అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కర్నూలులో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని శాంతి భద్రతలు దెబ్బ తింటాయని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తల్లి అనారోగ్యం కారణంగానే ఆయన సీబీఐ విచారణకు హాజరు కాలేకపోతున్నాడని ఎస్వీ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విచారణకు అవినాశ్ రెడ్డి కోరినట్టు సీబీఐ అధికారులు గడువు ఇవ్వాలని మోహన్ రెడ్డి కోరారు.
కొద్ది సేపటి క్రితం కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న అవినాశ్ రెడ్డితో శ్రీ లక్ష్మీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆమెకు జరుగుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కాపాడటం కోసం సీఎం జగన్ రాజ్యాంగాన్నే దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విమర్శించారు. తమ్ముడు అరెస్ట్ కాకుండా అడ్డుపడటం వెనకున్న చిదంబర రహస్యం ఏమిటో జగన్ బయటపెట్టాలని విజయ్ డిమాండ్ చేశారు. జగన్ తన తండ్రి కుటుంబాన్ని, తల్లిని, చెల్లిని పక్కనపెట్టి మరీ అవినాశ్ రెడ్డిని కాపాడటానికి ఎందుకు ఇంతలా దిగజారుతున్నాడో అని విజయ్ ప్రశ్నించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తథ్యమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అవినాశ్ వ్యవహారంలో సీబీఐ (CBI) అధికారులు సీరియస్‌గా ఉన్నారని, సోమవారం అరెస్టు చేయడం తథ్యమని ఆయన తెలిపారు.
అవినాశ్ రెడ్డి అరెస్ట్ విషయంలో కర్నూలు ఎస్పీతో మరో సారి సీబీఐ అధికారులు భేటీ అయ్యారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు కర్నూలు పోలీసులు సహకరించటం లేదని సీబీఐ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీఆరీఎఫ్ బలగాలు కర్నూలు చేరుకున్నాక అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.
వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోందని సమాచారం.. ఉదయం నుంచి కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డిని కలిసేందుకు పలు సార్లు ప్రయత్నించిన సీబీఐ అధికారులు విఫలమయ్యారు. అవినాశ్ అనుచరులు సీబీఐ అధికారులను అడ్డుకోవటంతో వెనుదిరిగిన సీబీఐ అధికారులు హైదరాబాద్, ఢిల్లీలోని సీబీఐ కార్యాలయాలకు సమాచారం ఇచ్చారు. తమకు సెక్యూరిటీ కావాలని జిల్లా ఎస్పీని కోరారు.. కాసేపట్లో కర్నూలుకు సీఆర్పీఎఫ్ బలగాలు రాబోతున్నాయని సమాచారం.
అవినాశ్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఎంపీ అవినాష్ అనుచరులు హల్ చల్ చేస్తున్నారు. సీబీఐ అధికారులు ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతమైన పరిస్థితి ఆస్పత్రి వద్ద నెలకొంది. ఈ పరిస్థితిలో సీబీఐ అధికారులు ఆస్పత్రి లోపలకు వెళ్లి అవినాష్‌ను కలిసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో సీబీఐ జిల్లా ఎస్పీతో మాట్లాడి తమకు ప్రొటక్షన్ కావాలని కోరారు. దీంతో కొంతమంది పోలీసులు ఆస్పత్రి వద్దకు బందోబస్తు వచ్చినప్పటికీ.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.
Whatsapp Image 2023 05 22 At 2.24.30 Pm
సుప్రీం కోర్టులో తన బెయిల్ పిటిషన్ విచారణలో ఉందని, రేపు విచారణకు రానుందని సీబీఐకి ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ రాశారు. 27 వరకు విచారణకు మినహాయింపు ఇవ్వాలని ఆ లేఖలో సీబీఐని అవినాశ్ రెడ్డి కోరారు. తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా 27 వరకు విచారణకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐని అవినాశ్ రెడ్డిని కోరారు.
అవినాశ్ వ్యవహారంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఎస్పీతో సీబీఐ అధికారుల చర్చలు కొనసాగుతున్నాయి.
అవినాశ్ లొంగిపోవాల్సిందిగా ఎస్పీకి లేఖ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయంపై కాసేపట్లో స్పష్టత రానుంది. ఎస్పీ... సీబీఐ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇక ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్‌లో అవినాశ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందుకు అవినాష్ రెడ్డి పిటిషన విచారణకు వచ్చింది. దీన్ని వేరే బెంచ్‌కు వెళ్లాలని జస్టిస్ జేకే మహేశ్వరి బెంచ్ సూచించింది. జస్టిస్ సంజయ్ కరోల్ అనిరుద్ బోస్ బెంచ్ ముందుకు వెళ్లిందీ పిటిషన్. అయితే ముందుగా మెన్షన్ చేసిన కేసులనే వాదిస్తామని మెన్షన్ అధికారులకు చెప్పారా అని బెంచ్ ప్రశ్నించింది. దీనికి అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు లేదని చెప్పారు. ఇది అర్జెంట్‌గా విచారించాల్సి ఉందని అందుకే మెన్షన్ అధికారులకు చెప్పలేదని పేర్కొన్నారు. అయితే లిస్ట్ అయిన కేసులను మాత్రమే విచారిస్తామని తేల్చి చెప్పిందా బెంచ్. మరోసారి మెన్షన్ అధికారులను సంప్రదించి లిస్ట్ చేయించుకోవాలని సూచించారు. దీని వల్ల ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాకుండా పోయింది.
అవినాశ్ వ్యవహారంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఎస్పీతో సీబీఐ అధికారుల చర్చలు కొనసాగుతున్నాయి.
అవినాశ్ లొంగిపోవాల్సిందిగా ఎస్పీకి లేఖ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయంపై కాసేపట్లో స్పష్టత రానుంది. ఎస్పీ అవినాశ్ రెడ్డితో
చర్చలు జరుపుతున్నట్టు సమాచారం..
అవినాశ్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐకి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సుప్రీం కోర్టులో అవినాశ్ వేసిన బెయిల్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మెన్షనింగ్ లిస్ట్‌లో ఉంటేనే విచారిస్తామని న్యాయమూర్తులు తెలిపారు. అవినాశ్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు సంజయ్ కరోల్, అనిరుధ్ బోస్ ధర్మాసనం రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని సూచించింది.
అవినాశ్‌ను అరెస్ట్ చేయటానికి సీబీఐకి అడ్డంకులు తొలగిపోయాయి. సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ అవినాశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విచారించటానికి నిరాకరించింది. రేపు రెగ్యులర్ బెంచ్ లో పిటిషన్ వేసుకోవాలని సూచించింది.
మాజీ మంత్రి వివేకా హత్యకేసులో సహనిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశముంది. దీంతో విశ్వభారతి ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆస్పత్రి గేటు దగ్గర వైసీపీ శ్రేణులు బైఠాయించాయి. మరోవైపు.. ఆస్పత్రి ఆవరణలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పులివెందుల నుంచి కర్నూలుకు పెద్ద ఎత్తున అవినాష్ అనుచరులు, వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. కర్నూలులో పరిస్థితిపై సీబీఐ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
అవినాశ్ అరెస్ట్ ఉంటుందా.. లేదా అన్న అంశంపై కాసేపట్లో క్లారిటీ రానుంది.. ఢిల్లీ సీబీఐ అధికారుల సూచనల మేరకు కర్నూలులో ఉన్న సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే కర్నూలు ఎస్పీతో మాట్లాడిన సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని కలవనున్నారు.
కాసేపట్లో కర్నూలులో ఉన్న సీబీఐ అధికారుల బృందాలు విశ్వభారతి ఆసుపత్రికి చేరుకోనున్నారు.
ఆసుపత్రిలో అవినాశ్ రెడ్డితో సీబీఐ ఎస్పీ మాట్లాడే అవకాశముంది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయం, ఢిల్లీ సీబీఐ
అధికారులతోనూ కర్నూలులో ఉన్న అధికారులు మాట్లాడుతున్నారు. కర్నూలు ఎస్పీ తో ఇప్పటికే సీబీఐ ఎస్పీ వికాస్ కుమార్ మాట్లాడారు.
అవినాశ్‌ను అరెస్ట్ చేస్తారా.. లేదా నోటీసులిస్తారా.. కర్నూలు ఎస్పీతో సీబీఐ అధికారులు
ఏం చర్చిస్తున్నారన్న అంశాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో సీబీఐ అధికారులు
కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి రావచ్చని తెలుస్తోంది.
కర్నూలు ఆసుపత్రి చుట్టూ అవినాశ్ అనుచరులు, అభిమానులు నిరసన తెలుపుతున్నారు. గేటు బయట పెద్ద సంఖ్యలో మొహరించిన అభిమానులను పోలీసులు వెళ్లిపోవాలని చెబుతున్నారు. విశ్వభారతి ఆసుపత్రి వైపు రాకపోకలను నిషేధించారు. ఆసుపత్రి దగ్గర భారీగా పోలీసులు మొహరించారు. మరికొద్ది సేపట్లో సీబీఐ అధికారులు ఆసుపత్రికి రావచ్చని తెలుస్తోంది.
అవినాశ్ విషయంలో సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీతో పలు మార్లు చర్చిస్తున్నారు. ఉదయం నుంచి ఇదే ఉత్కంఠ కొనసాగుతుండటంతో
ఏం జరుగుతుందో నన్న టెన్షన్ నెలకొంది. పది గంటల తర్వాత మరో సారి అవినాశ్ రెడ్డి విషయంలో కర్నూలు జిల్లా ఎస్పీతో మరో సారి
మాట్లాడారు.
సీబీఐ ముందు విచారణకు హాజరయ్యేందుకు మరో ఏడు రోజుల గడువు కావాలని ఎంపీ అవినాశ్ రెడ్డి కోరారు.
సీబీఐ అడిషనల్ ఎస్పీ ముఖేశ్శర్మకు ఆయన ఇవాళ ఉదయం మరో లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యంతో
ఉన్నారని అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్‌ను పొందుపరుస్తున్నానని ఆ లేఖలో అవినాశ్ సీబీఐని కోరారు.
తన తల్లి అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్నారని, వైద్యుల సమక్షంలో నా తల్లి ఉండాలని
చెప్పారని, తన తండ్రి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నందున తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి మరో సారి సీబీఐకి లేఖ రాశారు.
ఎస్పీ బంగ్లా లో ఉన్న. ఎస్పీ కృష్ణకాంత్
ఎస్పీ వద్దకు పలుసార్లు వెళ్లి వచ్చిన సీబీఐ అధికారులు
పలు దఫాలుగా ఎస్పీ తో మాట్లాడిన సీబీఐ అధికారులు
ఎస్పీ కి అధికారికంగా లేఖ ఇచ్చిన సీబీఐ అధికారులు
అవినాశ్ రెడ్డి అరెస్ట్‌పై క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. ఢిల్లీ నుంచి స్థానిక పోలీసు అధికారులతో సీబీఐ బృందం మాట్లాడుతోంది. కర్నూలులో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ సీబీఐ ఆఫీస్‌కు కర్నూలుకు వెళ్లిన అధికారులు సమాచారం అందిస్తున్నారు. మరికొందరు.. కర్నూలు ఎస్పీ కార్యాలయానికి కొందరు సీబీఐ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం ఎస్పీ ఆఫీస్, ఆస్పత్రి దగ్గర మరికొంత మంది సీబీఐ అధికారులు ఉన్నారు. కర్నూలు ఎస్పీకి లిఖితపూర్వకంగా సీబీఐ ఎస్పీ సమాచారం ఇచ్చారు. లొంగిపోవాలని ఎంపీ అవినాష్‌కు చెప్పాలంటూ సీబీఐ అధికారులు ఎస్పీని కోరినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా జిల్లా ఎస్పీతో సీబీఐ అధికారులు చర్చిస్తున్నారు. అవినాష్‌రెడ్డిని అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందని సీబీఐ చెబుతోంది.
Whatsapp Image 2023 05 22 At 10.56.47 Am
డప ఎంపీ అవినాష్ రెడ్డి లక్ష్మి గారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ఆమెకు నాన్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (హార్ట్ అటాక్) ఉంది....
ఆమె యాంజియోగ్రామ్ డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నారు.
ఆమె మా వైద్యుల బృందం పర్యవేక్షణలో CCUలో ఉన్నారు.
ఆమె రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉందని,ఆమె అయానోట్రోపిక్ సపోర్ట్‌లో ఉంది.
ఆమెకు బిపి తక్కువగా ఉన్నందున ఆమెకు మరికొన్ని రోజులు ఐసియులో ఉండవలసి ఉంది.
అనారోగ్య కారణాలతో రాలేనంటూ అవినాష్ లేఖ...
ఆసుపత్రి ఎదుట వైసీపీ కార్యకర్తల ఆందోళన..
గేటు ముందు బైఠాయించిన కార్యకర్తలు
విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి.. కొత్తవారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు...
ఆసుపత్రి పరిసరాల్లో బారీకేడ్లు ఏర్పాటు...
కర్నూలు ఎస్పీతో సమావేశమైన సీబీఐ అధికారులు... కాసేపట్లో తదుపరి చర్యలు తీసుకునే అవకాశం