గత నాలుగు రోజులుగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశంపై రగడ కొనసాగుతోంది. ఈనెల 22న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో వారం రోజులపాటు తాను విచారణకు హాజరుకాలేనని పేర్కొంటూ సీబీఐకి లేఖ రాశారు. దీంతో సీబీఐ అధికారులు నేరుగా కర్నూలుకు చేరుకున్నారు.
Avinash Reddy Vs CBI: గత నాలుగు రోజులుగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశంపై రగడ కొనసాగుతోంది. ఈనెల 22న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో వారం రోజులపాటు తాను విచారణకు హాజరుకాలేనని పేర్కొంటూ సీబీఐకి లేఖ రాశారు. దీంతో సీబీఐ అధికారులు నేరుగా కర్నూలుకు చేరుకున్నారు. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి నుంచి అవినాష్ రెడ్డి బయటకు రావడం లేదు. తల్లి వద్దే ఉంటున్నాడు. మూడుసార్లు విచారణకు హాజరుకాకుంటే చర్యలు తీసుకునే అవకాశం సీబీఐకి ఉంటుంది.
అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారనే వదంతులు వ్యాపించడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు కర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఇక ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కొత్తవారు ఎవరిని అనుమతించడం లేదు. సీబీఐకి పోలీసులు సహకరించాలని కోరినా లాభం లేకపోవడంతో అధికారులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అవినాష్ అంశంపై నేడు సీబీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చిన వెంటనే ఆయన తరపు లాయర్లు సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అరెస్ట్ చేయకుండా నిలుపుదల చేయలేమని, ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి గురువారం రోజున నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్నూలులోనూ, వైఎసీపీ కార్యకర్తల్లోనూ తెలియని టెన్షన్ నెలకొన్నది. అయితే, ముందస్తు బెయిల్ ఇవ్వరాదని, బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందిని, ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 30 వరకు పూర్తి చేయాల్సి ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదించేందుకు రెడీ అవుతున్నది.
అదేవిధంగా, అటు వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి కూడా ఇంప్లీడ్ పిటిషన్ను దాఖలు చేసింది. అవినాష్ రెడ్డికి ఎట్టిపరిస్థితుల్లోనూ ముందస్తు బెయిల్ ఇవ్వరాదని ఆమె తరపు న్యాయవాదులు వాదించనున్నారు. కాగా, గురువారం ఈ పిటిషన్పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉండటంతో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్నది. రేపైనా ఈ ఉత్కంఠకు తెరపడుతుందా చూడాలి.